లేడీస్ స్పెషల్.. నుమాయిష్

లేడీస్ స్పెషల్.. నుమాయిష్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌ లో జరుగుతున్న 85వ నుమాయిష్​లో మంగళవారం మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన లేడీస్ డే సెలబ్రేషన్స్​లో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావల్లి మాట్లాడారు.

నిజాం కాలం నుంచి మహిళల కోసం నుమాయిష్​లో ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించేవారని, అది నేటికీ కొనసాగడం అభినందనీయమన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల విద్యార్థినిలు చేసిన కూచిపూడి, కథక్, ఫోక్ డాన్స్​లు ఆకట్టుకున్నాయి. – వెలుగు, బషీర్ బాగ్