ఇబ్రహీంపట్నం/మెహిదీపట్నం/ కూకట్పల్లి, వెలుగు: వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో లారీ ఢీకొని లైన్మెన్ మృతి చెందాడు. మేడిపల్లికి మహ్మద్ముజాహెద్(26) కొత్తూరులో జూనియర్ లైన్ మెన్ పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి విధులు ముగించుకొని తన పల్సర్ బైక్‌పై యాచారం వైపు వెళ్తుండగా, లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముజాహెద్అక్కడికక్కడే మృతి చెందాడు.
బస్సు సడెన్‌బ్రేక్ వేయడంతో.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
లంగర్‌హౌస్ పరిధిలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. నార్సింగి అల్కాపురి టౌన్ షిప్‌కు చెందిన వెంకట రాఘవేందర్ (37) సాఫ్ట్వేర్ ఉద్యోగి. గురువారం తన భార్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో లంగర్‌హౌస్ బ్రిడ్జిపై ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడన్‌బ్రేక్ వేసింది. వెనకాలే వస్తున్న లారీ కూడా ఒక్కసారిగా స్లో కావడంతో లారీని ఢీకొని రాఘవేందర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
కేపీహెచ్బీలో వృద్ధుడు
కేపీహెచ్బీలో రోడ్డు దాటుతుండగా, ఆటో ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. నిజాంపేటకు చెందిన దిలీప్‌కుమార్ (77) గురువారం హోలిస్టిక్ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చాడు. చికిత్స అనంతరం రోడ్డు దాటుతుండగా, నిజాంపేట వైపు నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో దిలీప్‌కుమార్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
