బీబీపేట్ లో చిరుత పిల్ల సంచారం

బీబీపేట్ లో చిరుత పిల్ల సంచారం

నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండలం బీబీపేట గ్రామంలో ఓ ఇంటి పరిసరాలలో శనివారం చిరుత పిల్ల సంచరించింది. మధ్యాహ్నం సమయంలో అక్కడే కొంతసేపు తిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్​ అయ్యాయి. వెంటనే గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

అటవీ ప్రాంతం బార్డర్​లో ఉన్న నాగధర్, బీబీ, సంజీరావుపేట గ్రామాల్లో తరచు చిరుత పులి కనిపిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల బీబీపేట శివారులో చిరుతపులి ఓ లేగదూడను చంపి తిన్నది. నల్లవాగు చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి వెంటనే చిరుత పులిని దాని పిల్లను పట్టుకోవాలని కోరుతున్నారు.