
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. పొంటపొలాల్లో రైతులకు చిరుత పులి కనిపించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం రెండు పులిపిల్లల ఆనవాళ్లు కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అవి పులిపిల్లల పాదముద్రలే అని అధికారులు గుర్తించారు. బోను కూడా ఏర్పాటు చేశారు. అయనా ఫలితం లేకపోవడంతో రైతులు భయపడుతున్నారు.