మనకే వణుకు వస్తుంది.. : ఆ పిల్లోడు ఏంట్రా.. పాములు, పులులు, మొసళ్లతో ఆటలు

మనకే వణుకు వస్తుంది.. : ఆ పిల్లోడు ఏంట్రా.. పాములు, పులులు, మొసళ్లతో ఆటలు

బల్లిని చూస్తేనే గంతులేస్తారు.. బొద్దింక కనిపిస్తే బెంబేలు.. కుక్క వెంటపడితే పరుగో పరుగు.. ఇక పాము అల్లంత దూరాన కనిపించినా కంగారు పుడుతుంది.. అలాంటిది ఈ పిల్లోడు ఏంట్రా అంటే.. మెడలో రుద్రాక్ష మాల వేసుకున్నట్లు పాములు వేసుకున్నాడు.. ఒళ్లో బొమ్మలు పెట్టుకున్నట్లు మెసలిని పెట్టుకున్నాడు.. కుక్కను ఇంట్లో పెంచుకున్నట్లు.. పులితో ఆడుకుంటున్నాడు.. ఇవన్నీ ఒక్క పిల్లోడు చేసినవే.. ఈ పిల్లోడుని చూసిన ఇంటర్నెట్ నెటిజన్లకు సైతం ఇప్పుడు చెమటలు పడుతున్నాయి.. 

ఎప్పుడు..ఎక్కడ జరిగిందో తెల్వదు కానీ అక్టోబర్ 15న  నౌమన్ హాసన్ అనే వ్యక్తి తన  ఇన్‌స్టాగ్రామ్ లో  పోస్ట్  చేసిన   ఈ వీడియో  వైరల్ అవుతోంది.  ఇప్పటి వరకు ఈ వీడియోకు 7 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

చిన్న పిల్లాడు కుర్చీలో కూర్చుండగా..  తన మెడకు పామును చుట్టుకుని ప్రశాంతంగా దానితో ఆడుకుంటున్నాడు. అలాగే  పిల్ల మొసలి అతని ఒడిలో పడుకుని ఉంది. అంతేగాదు  పిల్లాడి వెనకాలు  పులి కూర్చుని ఉంది. ఈ వీడియో  చూసిన వాళ్లకే చెమటలు వస్తుండగా పిల్లాడు మాత్రం కొంచెం కూడా భయం లేకుండా   బొమ్మలతో ఆడుకుంటున్నట్లు ఆడుకుంటున్నాడు.

ALSO READ : నీ డేర్ మామూలుదా : మొసలిని భుజాలకెత్తుకున్నాడు

ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. ముసలి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తందని..దయచేసి మొసలి నోరు తెరవాలని కామెంట్  చేస్తున్నారు.