ఆధార్ కార్డు పోయిందా ? నంబర్ మర్చిపోయారా ? జస్ట్ ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..

ఆధార్ కార్డు పోయిందా ? నంబర్ మర్చిపోయారా ?  జస్ట్ ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..

ఈ రోజుల్లో ఆధార్ కార్డు చాలా కీలకంగా మారింది. ప్రభుత్వ పనుల నుండి ప్రైవేట్ పనుల వరకు.. పిల్లల స్కూల్ అడ్మిషన్ల కోసం కూడా ఆధార్ తప్పనిసరి. అయితే ఆధార్ కార్డులో మీ వివరాలతో పాటు 12 అంకెల ఓ నంబర్ ఉంటుంది. అయితే మీ ఆధార్ కార్డు పోయినా లేదా నంబర్ మర్చిపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ ఇ-ఆధార్‌ను ఆన్‌లైన్‌లో ఇంట్లో ఉండే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 ఆధార్ నంబర్ తెలుసుకోవడానికి: మీ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ఆధార్‌తో లింక్ అయి ఉంటే మీ ఆధార్ నంబర్‌ను ఈజీగా  తెలుసుకోవచ్చు. ఇందుకు ముందుగా UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లండి.
*'My Aadhaar' విభాగంలో  Retrieve Lost or Forgotten UID/EID  అనే దానిపై క్లిక్ చేయండి.
*మీ పూర్తి పేరు, మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఇంకా  క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
*ఇప్పుడు Send OTP పై క్లిక్ చేయండి.
*మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి 'SUBMIT' చేయండి. ఇప్పుడు మీ ఆధార్ వివరాలు అంటే మీ ఆధార్ నంబర్ మీ మొబైల్ నంబర్‌కు వస్తుంది. 

 మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే:  మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే మీరు మీ ఆధార్ వివరాలను తెలుసుకోవడానికి ఆధార్ సెంటరుకి వెళ్ళాలి. మీరు ఆధార్ కార్డు ఎంట్రీ చేయించుకున్నప్పుడు ఇచ్చిన 28 అంకెల EID (ఎన్రోల్‌మెంట్ ఐడీ) నంబర్‌  అందించాలి. ఆ తర్వాత  వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్(EYE SCAN) చేయవలసి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక మీరు మీ ఇ-ఆధార్ కాపీ ఇస్తారు. దీనికి రూ.30 వరకు చార్జెస్ తీసుకుంటారు. 

  PVC ఆధార్ కార్డు ఎలా: ఆధార్ జారీ చేసే సంస్థ UIDAI, ప్లాస్టిక్ (PVC) ఆధార్ కార్డును కేవలం రూ.50కే ఇస్తుంది. ఈ కార్డుని మీ వాలెట్‌లో ATM కార్డులాగా పెట్టుకోవచ్చు. 

PVC ఆధార్ కార్డు కోసం: మొదట UIDAI వెబ్‌సైట్‌కు వెళ్లండి. మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేసి 'సెండ్ ఓటీపీ' పై క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. తరువాత  Order Aadhaar PVC Card పై క్లిక్ చేయండి. మీ వివరాలు చెక్ చేసుకుని 'NEXT' పై క్లిక్ చేయండి. తరువాత కనిపించే  Payment ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా రూ.50 చెల్లించాలి. కట్టిన పూర్తయిన తర్వాత మీ PVC కార్డు ఆర్డర్ పూర్తవుతుంది. UIDAI 5 రోజుల్లో కార్డును ప్రింట్ చేసి పోస్ట్‌కు ద్వారా మీ ఇంటికి పంపిస్తుంది. 

 ఆధార్ కార్డు అందుబాటులో ఉన్న ఫార్మాట్‌లు: ఆధార్ కార్డు ప్రస్తుతం మూడు రకాలుగా ఉంది. 
Aadhaar Letter- పెద్ద కాగితంపై వచ్చేది.
e-Aadhaar - ఆన్‌లైన్ కాపీ (డౌన్‌లోడ్ చేసుకునేది).
PVC Card - ప్లాస్టిక్ కార్డు.

అయితే మార్కెట్‌లో  తయారు చేసే  PVC కార్డులు ప్రభుత్వ/ ప్రైవేట్ పనపనులకు  చెల్లవు. UIDAI ద్వారా ఆర్డర్ చేసిన PVC కార్డు మాత్రమే పనిచేస్తుంది.