ఆసియా క్రీడల్లో అదరగొట్టిన లవ్లీనా.. 2014 తర్వాత బాక్సింగ్లో ఇండియాకు గోల్డ్ మెడల్!

ఆసియా క్రీడల్లో అదరగొట్టిన లవ్లీనా.. 2014 తర్వాత బాక్సింగ్లో ఇండియాకు గోల్డ్ మెడల్!

ఏషియన్ గేమ్స్-2026 లో లవ్లీనా బోర్గోహైన్ చరిత్ర సృష్టించింది. బాక్సింగ్ లో భారత్ కు బంగారు పతకం అందించింది. మేరీ కోమ్ తర్వాత ఇండియాకు స్వర్ణం తెచ్చిన బాక్సర్ గా చరిత్రను లిఖించింది. 20263 అక్టోబర్ 2న  జరిగిన 75 కేజీ విభాగంలో బాక్సింగ్ ఫైనల్ లో చైనా ప్లేయర్ ను తుక్కురేగ కొట్టి బంగారు పతకాన్ని ముద్దాడింది. 

ఫైనల్ లో చైనా బాక్సర్ జియి బావోను 5-0 తో చిత్తు చేసింది. మొదటి నుంచి ఎక్కడా ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా మ్యాచ్ మొత్తాన్ని తన ఆధీనంలో ఉండేలా చూసుకుంది. ఐచీ-నగోయాలో జరిగిన ఫైనల్ లో గోల్డ్ గెలిచి ఇండియా స్వర్ణ పతకాల సంఖ్యను 12కు చేర్చింది. 

ఏసియన్ గేమ్స్ బ్యాక్ టు బ్యాక్ ఫైనల్ చేరిన బాక్సర్ గా లవ్లీనా (29) రికార్డు సృష్టించింది. గత ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్ సాధించిన లవ్లీనా.. ఈ సారి ఏకంగా గోల్డ్ మెడల్ సాధించడం విశేషం. 

మరొక విషయం ఏంటంటే.. ఇవాళ (2026 అక్టోబర్ 02) లవ్లీనా పుట్టిన రోజు. బర్త్ డే సందర్భంగా గోల్డ్ మెడల్ అందుకోవడం లవ్లీనాకు ఇంతకు మించిన బర్త్ డే గిఫ్ట్ ఉండదేమో.