LSG vs CSK: భారీ స్కోర్ మిస్ చేసుకున్న లక్నో.. ఇంగ్లిస్ కూడా చేతులెత్తేసి ఉంటే.. చెన్నై టార్గెట్ ఎంతంటే..?

LSG vs CSK: భారీ స్కోర్ మిస్ చేసుకున్న లక్నో.. ఇంగ్లిస్ కూడా చేతులెత్తేసి ఉంటే.. చెన్నై టార్గెట్ ఎంతంటే..?

9 ఓవర్లకు 112 అంటే ఓవర్ కు 13 రన్ రేట్. ఇది టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో స్కోర్. జోష్ ఇంగ్లిస్ విధ్వంసంతో చెన్నై బౌలర్లకు చెమటలు పట్టిన పరిస్థితి. దీంతో లక్నో భారీ స్కోర్ చేస్తుందని.. మినిమమ్ 230 కి తగ్గకుండా ఉంటుందని భావించారు అందరు. కానీ.. ఇంగ్లస్ ఔటవ్వడంతో అంతా తారుమారైంది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై ముందు 204 రన్స్ టార్గెట్ పెట్టారు.

ఇంగ్లిస్ తర్వాత  లక్నో బ్యాటర్లు వరుసగా పెవిలియన్ క్యూ కట్టడంతో భారీ స్కోర్ మిస్ చేసుకుంది లక్నో. ఇంగ్లిస్ తర్వాత ఒక్క షహబాజ్ అహ్మద్ మాత్రమే 43 రన్స్ చేసి స్కోర్ 200 దాటడంలో కీలక పాత్ర వహించాడు. ఇక మిగతా వారిలో ఒక్కరంటే ఒక్కరు 20 రన్స్ పైగా చేయలేదంటే ఎంత అధ్వానంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. లక్నో బ్యాటర్ల పేలవ ప్రదర్శనతో 8 వికెట్ల నష్టానికి చెన్నై ముందు 204 రన్స్ టార్గెట్ మాత్రమే పెట్టగలిగారు. 

ఇంగ్లిస్ విధ్వంసం.. దెబ్బ కొట్టిన ఓవర్టన్:

లక్నో ఓపెనర్లలో జోష్ ఇంగ్లిస్ జోష్ కు చెన్నై బౌలర్లు విలవిలలాడారు. ఒకానొక దశలో 30 బంతులలోపే సెంచరీ చేస్తాడేమో అన్నంతగా చెలరేగాడు. చివరికి 33 బంతులలో 85 రన్స్ కొట్టి ఓవర్టన్ బౌలింగ్ లో సంజూ శాంసన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. మొత్తం 33 బంతులలో 6 సిక్సులు, 10 ఫోర్లతో వీర విహారం చేశాడు ఇంగ్లిస్. ఇంగ్లిస్ ఇన్నింగ్స్ తో ఈ మాత్రం స్కోర్ వచ్చింది లేదంటే.. లక్నో అట్టర్ ఫ్లాప్ అయ్చేదేనా..? అనే డౌట్ రాకమానదు.

   ఆ తర్వాత బ్యాటర్లంతా చేతులెత్తేయటంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 203 రన్స్ మాత్రమే చేయగలిగారు. షాహబాజ్ అహ్మద్ ఒక్కడు చివరిలో ఫోర్లు, సిక్సులతో మెరుపులు మెరిపించాడు. 25 బంతులలో 3 సిక్సులు, 3 ఫోర్లతో 43 రన్స్ చేసి స్కోర్ 200 దాటించాడు.

ఇక లక్నో బ్యాటర్లను ఓవర్టన్ గట్టిదెబ్బ కొట్టాడు. ఇంగ్లిస్, రిషబ్ పంత్, అక్షత్ రఘువంశీలను ఔట్ చేసి కట్టడి చేశాడు. మరో బౌలర్ అన్షుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ ఒక వికెట్ వికెట్ తీసుకున్నారు. నూర్ అహ్మద్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే 6 ఎకానమీలో బౌలింగ్ వేస్తూ ఒక వికెట్ తీసుకున్నాడు.