డిసెంబర్ 28 నుంచి మాలల రిలే నిరాహార దీక్షలు : చెన్నయ్య

డిసెంబర్  28 నుంచి మాలల  రిలే నిరాహార దీక్షలు : చెన్నయ్య
  • మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య వెల్లడి

మాదాపూర్, వెలుగు: రోస్టర్​ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతున్నదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. న్యాయం జరిగే వరకు ఈ నెల ​28 నుంచి ఇందిరాపార్క్​ ధర్నాచౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు.శుక్రవారం మాదాపూర్​ ఇజ్జత్​నగర్​లోని అంబేద్కర్​ విగ్రహానికి మాల మహానాడు, బీఎస్పీ లీడర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం మాల సంఘం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నయ్య మాట్లాడారు. రోస్టర్​ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతున్నదని, తమ వర్గానికి ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి రావడానికి తాము ఎంతో కృషి చేశామన్నారు. ఔట్​సోర్సింగ్​ విధానం ద్వారా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.