మాలలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం : చెన్నయ్య

మాలలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం : చెన్నయ్య
  • మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య 

జీడిమెట్ల, వెలుగు: మాలలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. జగద్గిరిగుట్టలో ఆదివారం మాల మహానాడు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా, సరైన డేటా లేకుండా చేసిన వర్గీకరణతో మాలలు విద్య, ఉపాధి రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. గ్రూప్–3కి సంబంధించి ఒక్క ఉద్యోగం కూడా మాలలకు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మాలలకు రాజ్యాంగం కల్పించిన15శాతం విద్య, ఉద్యోగ అవకాశాలను 5 శాతానికి పరిమితం చేశారన్నారు. ఇటీవల ప్రకటించిన డెంటర్ అసిస్టెంట్ సర్జన్, శాతవాహన వర్సిటీ ఉద్యోగాల్లోనూ అన్యాయం జరిగిందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జగద్గిరిగుట్టకు చెందిన రాజేశ్​కు నియామక పత్రం అందజేశారు. మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం.సరళ, ప్రధాన కార్యదర్శి కె.లలిత, నాయకులు సతీశ్, రతన్, సాయికుమార్​  పాల్గొన్నారు.