ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే ఊరుకోం : తహసీల్దార్

ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే ఊరుకోం : తహసీల్దార్

మల్కాజిగిరి, వెలుగు: ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని తహసీల్దార్​ సుచరిత హెచ్చరించారు. కుషాయిగూడ జమ్మిగడ్డలోని 199/1, 376 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న నిర్మాణాలను సోమవారం ఆమె పరిశీలించారు. పలువురికి నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.