మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విషాద ఘటన జరిగింది. ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. దుండిగల్.. మైసమ్మగూడ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ లో 3వ సంవత్సరం చదివే హరినాథ్ అనే విద్యార్థి పురుగుల మందు తాగి.. మూడవ అంతస్థు నుంచి దూకాడు, అయితే హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకుతుండగా విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి విద్యార్థులు.. కళాశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
