కదిలే రైలు ఎక్కబోయి జారిపడ్డ వ్యక్తి.. తీవ్ర గాయాలు

కదిలే రైలు ఎక్కబోయి జారిపడ్డ వ్యక్తి.. తీవ్ర గాయాలు

కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి జారిపపడి ఫ్లాట్ ఫామ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా రైల్వేస్టేషన్ లో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా గుగ్గూసకు చెందిన బొజ్జం కుమారస్వామి అనే వ్యక్తి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చాడు. తిరిగి వెళ్ళే క్రమంలో శనివారం కదిలే రైలు ఎక్కుతుండగా జారిపడ్డాడు. గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును అపగా ఆవ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.