
జపాన్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మిడ్-సైజ్ SUV విక్టోరిస్‌ని గత నెలలో ఇండియాలో లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ కొత్త కాంపాక్ట్ SUV మోడల్ బ్రెజ్జాకి గ్రాండ్ విటారా మధ్యలో ఉంటుంది, దీనిని ఇతర టాప్ SUV మోడళ్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కి పోటిగా తీసుకొచ్చారు. విక్టోరిస్‌లో లేటెస్ట్ డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి.
విక్టోరిస్‌లో డిజైన్:
ఈ కొత్త SUV స్మూత్ గ్లాసి డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముందు భాగంలో గ్రిల్, LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు లేటెస్ట్ లుక్ ఇస్తుంది. ఈ కారు 18-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్‌లైన్, బ్లాక్డ్-అవుట్ ORVMలు, రూఫ్ రైల్స్‌తో కలిపి ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది.
ఫీచర్స్ :
విక్టోరిస్ అనేది ప్రీమియం, సౌకర్యవంతమైన అనుభవానికి ప్రాధాన్యతనిచ్చే టెక్నాలజీతో నిండిన కార్. క్యాబిన్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు కూడా సపోర్ట్ చేస్తుంది. లగ్జరీ అనుభూతికి పనోరమిక్ సన్‌రూఫ్, 64-రంగుల యాంబియంట్ లైటింగ్ తో పాటు పర్సనలైజెడ్ క్యాబిన్ వాతావరణాన్ని కల్పిస్తాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెనుక ఆటో AC వెంట్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో సౌకర్యంగా ఉంటుంది.
ధర & బుకింగ్:
మారుతి కొత్త విక్టోరిస్ కాంపాక్ట్ SUVని రూ. 12 నుండి 20 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఈ మిడ్-సైజ్ SUVని రూ. 11వేల టోకెన్ అమౌంట్‌తో బుకింగ్ చేసుకోవచ్చు.
సేఫ్టీకే మొదటి ప్రాధాన్యత:
ఈ మారుతి సుజుకి కార్ భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఫుల్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది, అంటే స్విఫ్ట్ డిజైర్ తర్వాత రెండవ మారుతి కారుగా నిలిచిన ఏకైక కార్. ఇంకా, విక్టోరిస్ లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)తో మొట్టమొదటి మారుతి కారు. స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ లో ఆరు ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి, ఈ కార్ అన్ని వర్గాల ప్రయాణీకులకు ఫుల్ సేఫ్టీ ప్యాకేజీని అందిస్తుంది.
ప్రస్తుతం మారుతి కొన్ని టాప్-ఎండ్ ట్రిమ్‌ల ధరలను 15వేల వరకు పెంచింది. ఈ ధర పెంపు కేవలం మైల్డ్-హైబ్రిడ్ వెర్షన్ లోని మొదటి రెండు వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మోడల్ లాంచ్ తర్వాత ధరలు పెంచడం ఇదే మొదటిసారి.
కొత్త ధరలు:
విక్టోరిస్ ZXi+ (O) 6-స్పీడ్ మాన్యువల్ ధర ఇప్పుడు రూ.17.91 లక్షలు.
విక్టోరిస్ ZXi+ (O) 6-స్పీడ్ ఆటోమేటిక్ ధర ఇప్పుడు రూ.18.26 లక్షలు.
ఈ రెండు మోడల్స్ ధర పాత ధరల కంటే రూ.15 వేలు ఎక్కువ.