గజియాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. రెసిడెన్షియల్ బిల్డింగ్ లో మంటలు

గజియాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. రెసిడెన్షియల్ బిల్డింగ్ లో మంటలు

ఢిల్లీ ఎన్​ సీఆర్​ పరిధిలోని గజియాబాద్​ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం( అక్టోబర్22) ఘజియాబాద్​ లోని  ఐదంతస్తు భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. భవనం నుంచి దట్టమైన పొగలతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. పక్క భవనాలకు వ్యాపించకుండా చర్యలు  చేపట్టారు. భవనంలోని నివాసితులను సురక్షితంగా తరలించారు.    

ప్రాథమిక సమాచారం ప్రకారం.. దీపావళి వేడుకల్లో భవనం సమీపంలో టపాసులు పేల్చడంతో ప్రమాదవశాత్తు భవనంలో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. ఇండ్లలో సామాన్లు, వస్తువులు అన్ని కాలిపోయాయి. మంటలు  వ్యాపించకముందే భవనంలో ఉన్న 12 కుటుంబాలను సురక్షితంగా తరలించారు. అగ్నిమాపక బృందం వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.