- మేడ్చల్ అడిషనల్ క లెక్టర్ రాధికగుప్తా
మల్కాజిగిరి, వెలుగు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికగుప్తా అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల దివ్యాంగులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బుధవారం ఆమె మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో దివ్యాంగులు రాణిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద పాల్గొన్నారు.

