ఐపీఎల్ వేలంలో రికార్డ్ సృష్టించిన ఇషాన్ కిషన్

ఐపీఎల్ వేలంలో రికార్డ్ సృష్టించిన ఇషాన్ కిషన్

బెంగళూరులో జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలం తిరిగి కంటిన్యూ అవుతోంది. యంగ్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ఈ సారి ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలో రికార్డ్ సృష్టించాడు. ఇతగాడిని ముంబై ఇండియన్స్ 15.25 కోట్లకు సొంతం చేసుకుంది.  ఆ తర్వాత  శ్రేయస్ అయ్యార్ ను 12.25 కోట్లకు కోల్ కతా సొంతం చేసుకోగా..   హసన్ రంగ ను 10.75 కోట్లకు..హర్షల్ పటేల్ ను  10.75 కోట్లకు ఆర్బీసీ కొనుగోలు చేసింది.

వాషింగ్టన్ సుందర్ ను సన్ రైజర్స్ 8 కోట్ల 75 లక్షలకు దక్కించుకుంది. గతేడాది వరకు అతను రాయల్ చాలెంజర్స్ తరపున ఆడాడు. గతేడాది 3 కోట్ల 20 పలికిన వాషింగ్టన్ సుందర్ ఈఏడాది రెట్టింపు ధరకు అమ్ముడుపోయాడు. కృనాల్ పాండ్యాను రూ.8.25 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.  అంబటి రాయుడిని 6.75 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. మిచెల్ మార్ష్ ను రూ.6.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.