పౌరసత్వ సవరణ చట్టంపై నాకు అభ్యంతరాలున్నాయి: అసదుద్దీన్‌ ఒవైసీ

పౌరసత్వ సవరణ చట్టంపై నాకు అభ్యంతరాలున్నాయి: అసదుద్దీన్‌ ఒవైసీ

కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈరోజు (మార్చి 11)న నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఏఏ అమలుతో డిసెంబర్ 31, 2014 లేదా అంతుకు ముందు పాక్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌లోకి వచ్చిన హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు పౌరసత్వం లభించనున్నది. ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ   పౌరసత్వ సవరణ చట్టం అమలు తీరుపై స్పందించారు. సీఏఏ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో పెట్టారని, ఇప్పుడే ఎందుకు అమలు చేశారో చెప్పాలని కేంద్రం ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.  ముస్లింలే లక్ష్యంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ తెచ్చారని ఆయన ఆరోపించారు.

ఐదేళ్ల పాటు ఇండియాలో నివాసం ఉన్న ఆరు కమ్యూనిటీలకు మాత్రమే పౌరసత్వం జారీకి మార్గం సుగమం కానున్నది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2019లో సీఏఏ చట్టానికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ ఇప్పటి వరకూ చట్టం అమలులోకి రాకుండా ఉంది.