యాదగిరిగుట్టలో మినీ లాక్ డౌన్

V6 Velugu Posted on May 04, 2021

యాదాద్రి భువనగిరి జిల్లా: కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో యాదగిరిగుట్టలో మినీ లాక్ డౌన్ ప్రకటించారు. మే 5 నుండి 10 రోజుల పాటు మినీలాక్ డౌన్ ఉంటుందని తెలిపారు యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ. కరోనా కట్టడికి యాదగిరిగుట్టలో మే 5వ తేదీ నుండి 10 రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి లాక్ డౌన్ ఉంటుందని..ఇందుకోసం ప్రజలందరూ సహకరించాలన్నారు. ఈ క్రమంలోనే  స్వచ్ఛందంగా షాపుల మూసివేతకు షాప్ ఓనర్ల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2 తర్వాత ఇండ్ల నుండి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు మున్సిపల్ చైర్ పర్సన్. అత్యవసర, నిత్యావసర సేవలకు మినహాయింపు ఉంటుందన్నారు. అవసరం అయితేనే బయటకు రావాలని కరోనాపై జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపారు.

Tagged lock down, corona, Yadagirigutta,

Latest Videos

Subscribe Now

More News