ప్రాక్టికల్గా ఆమలయ్యే హామీలనే మేనిఫెస్టోలో పెట్టాం : హరీశ్ రావు

  ప్రాక్టికల్గా ఆమలయ్యే హామీలనే మేనిఫెస్టోలో  పెట్టాం  : హరీశ్ రావు

రాష్ట్రం విభజన చట్టంలో పెట్టిన అంశాలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు మంత్రి హరీశ్ రావు. వీ6తో ఆయన మాట్లాడారు.  రాష్ట్రానికి 15 వందల కోట్లు రాకుండా కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపించారు. తమ  పథకాలనేు  కేంద్రం కాపీ కొట్టిందన్నారు. అవార్డులు ఇచ్చింది మీరే...మళ్లీ అభివృద్ధి లేదని తిట్టేది కూడా మీరనంటూ ఫైర్ అయ్యారు. స్కీంలతో తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తుంటే... స్కాంలతో కర్ణాటక ప్రభుత్వం ఆగమౌతుందన్నారు. కాంగ్రెస్ ఒక్క చాన్స్ కాదు...11సార్లు అవకాశమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు హరీశ్ రావు. తాము గతంలో  ఇచ్చిన హామీలను చేసి చూపించామన్నారు. 

కేసీఆర్ అంటే ప్రజలకు ఓ నమ్మకమని మంత్రి హరీష్ రావు అన్నారు.  14 ఏళ్లు పోరాడి కేసీఆర్ తెలంగాణను సాధించారని చెప్పారు.  బీఆర్ఎస్  మేనిఫెస్టోను  ప్రజలు నమ్ముతున్నారన్నారు.  మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఆంశాన్ని అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ ది అయితే  మేనిఫెస్టోలో  పెట్టన చాలా వాటిని బీఆర్ఎస్ చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినంత పెన్షన్ దేశంలో ఎవరూ ఇవ్వట్లేదన్నారు.  

అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే కొత్త హామీలను ప్రకటించామని హరీష్ రావు చెప్పారు.  అర్థిక నిపణులతో చర్చించి  ప్రాక్టికల్ గా ఆమలయ్యే హామీలనే మేనిఫెస్టోలో  పెట్టామన్నారు.  ఇవేమీ ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు కాదన్నారు.  కల్యాణి లక్ష్మి పథకం వలన రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గాయన్నారు.  రైతుబంధు ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని చెప్పారు.   రాష్ట్రంలో ప్రతి ఏడాది 10 నుంచి 14 శాతం  అర్థిక అభివృద్ది జరుగుతుందని చెప్పారు.  

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక లక్ష ఉద్యోగాలు ఇచ్చామన్నారు మంత్రి హరీష్ రావు. జాబ్ క్యాలెండర్ తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.  దురదృష్టవశాత్తు కొన్ని నోటిఫికేషన్ల విషయంలో తప్పులు జరిగాయన్నారు.  ఎన్నికలు, ఎగ్జామ్ ఒకేసారి కావడంతో  వాయిదా వేయక తప్పలేదని తెలిపారు.  రాబోయే రోజుల్లో  ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహిస్తామన్నారు.  

రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.  పదేళ్ల తర్వాత గిరిజన యూనివర్శిటీని కేంద్రం ప్రకటించిందని మరి వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని అడిగారు.  రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందన్నారు.