
డిసెంబర్ 20 తర్వాత ఎవరి బలం ఏంటో తెలుస్తుందన్నారు మంత్రి హరీశ్ రావు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 777 ఓట్లు ఉన్నాయన్నారు . గల్లీ బీజేపీ వరి వేయాలంటే..ఢిల్లీ బీజేపీ వరి వద్దంటూ ఆగం చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులను చిన్న చూపు చూసే విధంగా.. కించ పరిచే విధంగా మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం యాంసగిలో రారైస్ కొంటాం అని చెప్పింది. అయితే యసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుంది కానీ రా రైస్ రాదనే విషయం కిషన్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో ఇప్పటికే 2లక్షల 70 వేల క్వింటాల వడ్లు కొన్నామన్నారు. రైతులు ఆగం కావొద్దనేది టీఆర్ఎస్ ఉద్దేశమన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేద్దాం అంటే కిషన్ రెడ్డి ముందుకు రాలేదన్నారు.