టూరిజం ప్రమోషన్లో ప్రజలూ భాగస్వాములవ్వాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

టూరిజం ప్రమోషన్లో ప్రజలూ భాగస్వాములవ్వాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
  • మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: టూరిజం ప్రమోషన్లలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని సూచించారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆదివారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వద్ద బైక్, సైకిల్, స్కూటర్స్  ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సైకిల్  తొక్కి ఆకట్టుకున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్  స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది. 

సంప్రదాయ వస్త్రధారణతో బుల్లెట్ ర్యాలీలో హైదరాబాద్  విమెన్  బైకర్స్ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో రైడర్స్ కు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నదన్నారు. దేశంలోనే తెలంగాణను పర్యాటక రంగంలో మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. అందులో భాగంగానే టూరిజం కాంక్లేవ్ నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించామన్నారు. ఈ కార్యక్రమంలో  పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరు, ఈడీ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.