హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు : మంత్రి పొన్నం

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు : మంత్రి పొన్నం
  • అందజేసిన మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురుకులాల్లో పది, ఇంటర్ ఫలితాల్లో 90 శాతానికిపైగా రిజల్ట్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. గురువారం సెక్రటేరియెట్​లో బీసీ వెల్ఫేర్ హాస్టల్స్​కు కొత్తగా రిక్రూట్ అయిన 121 మంది వార్డెన్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ అపాయింట్ మెంట్ ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్స్​లో ఉంటున్న పిల్లల భవిష్యత్​ను మార్చే గొప్ప అవకాశం వార్డెన్లకు ఉంటుందని అన్నారు. విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్​ను అభివృద్ధి చేస్తూ వారికి భవిష్యత్ మార్గదర్శకులుగా ఉండాలన్నారు. పెద్దలకే పరిమితం అయిన సన్న బియ్యంను పేదలకు సైతం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. 

బీసీ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ.. చాలా ఏండ్ల తరువాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నియామకాలు జరిగాయని అన్నారు. హాస్టల్​లో చదువుకునే పిల్లలు బాగా చదవాలన్నా.. వారిలో మంచి క్రమశిక్షణ రావాలన్నా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వార్డెన్​లే చూసుకోవాలని ఆయన సూచించారు. త్వరలో వార్డెన్లకు ట్రైనింగ్ ఇస్తామని, ఫీల్డ్ లెవల్​లో ప్రాక్టికల్ వర్క్ నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాల మాయాదేవి, గురుకుల సెక్రటరీ సైదులు, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, మెట్టు సాయికుమార్, జైపాల్, జ్ఞానేశ్వర్, కాల్వ సుజాత, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.