ఐటీ టవర్​తో20 వేల ఉద్యోగాలు

ఐటీ టవర్​తో20 వేల ఉద్యోగాలు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: వచ్చే నెల 6న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ టవర్ ను ప్రారంభించనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ జి.రవినాయక్, ఇతర ఆఫీసర్స్ తో  ఐటీ టవర్ ను సందర్శించి మీడియాతో మాట్లాడారు.  ఒకప్పుడు తాగు, సాగునీటికి ఇబ్బంది పడిన పరిస్థితి నుంచి నేడు అన్ని రంగాల్లో పురోగతి సాధించామని తెలిపారు. ఐటీ టవర్ కోసం స్థానికంగా 400 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించామని, వాటికి పట్టా భూముల మాదిరి మెరుగైన పరిహారం అందించి ఇబ్బంది లేకుండా చూశామన్నారు.

స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఇక్కడే మంచి ఉద్యోగాలు అందిస్తామని తెలిపారు. సుమారు 20 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఐటీ టవర్ ప్రారంభం నాటికి లైటింగ్, అప్రోచ్ రోడ్,  ప్లాంటేషన్, ఇతర మౌలిక సదుపాయాలన్ని పూర్తి చేయాలని ఆఫీసర్స్ ను ఆదేశించారు. మంత్రి వెంట అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు.రైతులు తీసుకొచ్చిన  ధాన్యం తూకంలో చిన్న తేడా వచ్చినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం జెడ్పీ మీటింగ్ హాలులో ఆఫీసర్స్, రైతుబంధు సమితి, రైతు సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడారు. రైతులకు చిన్న సమస్య తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్  పాల్గొన్నారు.