
- రివ్యూ మీటింగ్లో అధికారులకు మంత్రి వివేక్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: నియమాలు, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని అధికారులను కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. సెక్రటేరియెట్‌లో బుధవారం మంత్రి మైనింగ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించే దిశగా మైనింగ్ రంగాన్ని మెరుగుపర్చాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల మైనింగ్ విభాగాల అధికారులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.