పాన్-ఆధార్ లింక్.. ఈ డెడ్ లైన్ దాటితే ఇబ్బందులు తప్పవు..

పాన్-ఆధార్ లింక్.. ఈ డెడ్ లైన్ దాటితే ఇబ్బందులు తప్పవు..

పాన్ (PAN) కార్డు, ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి ఇచ్చిన గడువు 31 డిసెంబర్  2025. కానీ ఈ ఆఖరి గడువు దాటితే చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇచ్చిన ఈ డేట్ దాటితే మీ పాన్ కార్డు పనిచేయడం ఆగిపోతుంది అంటే ఇన్ అక్టీవ్ అవుతుంది. గుర్తుంచుకోండి..  1 అక్టోబర్ 2024 కంటే ముందు ఆధార్ అప్లికేషన్  ఆధారంగా పాన్ కార్డు ఉన్నవారికి  వారికి మాత్రమే ఈ గడువు (31 డిసెంబర్  2025) వర్తిస్తుంది. మిగతా చాలా మందికి పాన్ ఆధార్  లింక్ చేయడానికి చివరి తేదీ 30 జూన్  2023 నాటితోనే ముగిసింది.

పాన్ పనిచేయకపోతే ఏమవుతుంది:
*మీ పాన్ నంబర్ పనిచేయకపోతే ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయలేరు.
*మీకు రావాల్సిన పన్ను వాపసు (Tax Refund) ఆగిపోతుంది లేదా రాకపోవచ్చు.
*అధిక TDS , TCS వర్తిస్తాయి. అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణంగా 10% బదులు 20% వరకు TDS విధించవచ్చు.

*బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొదలైనవి  ఓపెన్ చేయలేరు. 
*డెబిట్/క్రెడిట్ కార్డుల జారీలో సమస్యలు
*మ్యూచువల్ ఫండ్  కొనడంలో ఇబ్బందులు
*లోన్ కోసం అప్లయ్ చేసుకోవడంలో సమస్యలు 
*50వేల కంటే పైగా లావాదేవీలు, డిపాజిట్లు చేయలేరు.  
*విదేశీ ప్రయాణాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లలో పేమెంట్స్ చేయలేరు. 
*జీవిత బీమా (Life Insurance) ప్రీమియం చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి పాన్-ఆధార్ లింక్ చేయడానికి  వెయ్యి జరిమానా కట్టాల్సి ఉంటుంది.

అస్సాం, జమ్మూ & కాశ్మీర్, మేఘాలయ రాష్ట్రా ప్రజలు, భారతదేశంలో ఉండాలని వారు, 80 సంవత్సరాలు దాటినా లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఆధార్-పాన్ లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు.