స్పీడ్‌‌గా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు : ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 స్పీడ్‌‌గా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు : ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వేములవాడ, వెలుగు: గత సర్కార్​పదేళ్లుగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందని, కాంగ్రెస్​ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఆదివారం  వేములవాడ పట్టణంలోని బాలానగర్ లో ఇందిరమ్మ ఇళ్లకు గడప పూజ చేసి లబ్ధిదారులకు చీర సారెను అందజేశారు. 

పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరుతుందన్నారు. వేములవాడ నియోజకవర్గవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు చిలుక రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తోట రాజు, పుల్కం రాజు, కనికరపు రాకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శంకర్​ పాల్గొన్నారు. 

కోరుట్ల, వెలుగు:కోరుట్లలోని అతిపురాతన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం విప్​ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్​సీనియర్​ లీడర్ జువ్వాడి కృష్ణారావుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకుడు నరసింహచారి వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎతిరాజం నర్సయ్య వారిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కటుకం దివాకర్, శ్రీనివాస్, విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాములు, గంగాధర్​,  పద్మ, కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్​ తిరుమల గంగాధర్​, నాయకులు ప్రభాకర్, నాగభూషణం, మహిపాల్​రెడ్డి పాల్గొన్నారు.