డబుల్ ఇండ్ల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

డబుల్ ఇండ్ల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ  : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ పట్టణ కేంద్రంలో సొంత స్థలాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించుకున్న 72 మంది లబ్ధిదారులకు రూ.1.50 కోట్ల చెక్కులను వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ లోని తన స్వగృహం వద్ద శుక్రవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లు లేని పేదల కల నెరవేర్చాలన్న ఉద్దేశంతో తాను పని చేస్తున్నానన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే బిల్లులు ఇప్పిస్తానని తెలిపారు.  కార్యక్రమంలో అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సహకార సంఘం చైర్మన్  ఎరువల కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గురు వినయ్ కుమార్, నార్ల సురేశ్, నార్ల రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.