- సీఎంకు ఎమ్మెల్యే శ్రీగణేశ్ వినతి
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే శ్రీగణేశ్ కోరారు. సీఎం రేవంత్‌రెడ్డిని మంగళవారం ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు.
నియోజకవర్గంలో మహిళా భవన్, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానవాటికల నిర్మాణం, బోర్వెల్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని, నిధుల విడుదలపై త్వరలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
