
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఎమ్మెల్సీ అద్దంకి ఫైర్
హైదరాబాద్, వెలుగు: ‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. నీ ఆత్మగౌరవం ఎటు పోయింది’అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. సీఎల్పీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నావా? మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నావు. నీతో కేటీఆర్ మాట్లాడిస్తున్నాడని మాకు తెలుసు. గతంలో బీఆర్ఎస్ మీద ఎన్నో ఆరోపణలు చేశావు. మర్చిపోయావా? ఇప్పుడు అవే నీకు గుచ్చుకుంటున్నాయి. పనికిమాలిన కేసీఆర్ ఫ్యామిలీ కోసం నువ్వెందుకు అంతలా స్పందిస్తున్నావు? ముందు ఎర్ర రంగు, తర్వాత బహుజన రంగు నుంచి గులాబీ రంగులోకి కలిసిపోయావు.
ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావ్.. సిగ్గులేదా?’’అని అద్దంకి దయాకర్ అన్నారు. రాజకీయ అవసరాల కోసం కేటీఆర్‌తో కలిసి అంతలా దిగజారి మాట్లాడటం దురదృష్టకరమని తెలిపారు. బీఆర్ఎస్ అంటే.. బిజినెస్ రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు.