కొండగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు..

కొండగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు..

 జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుండే స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. కాగా, సమ్మక్క సారక్క జాతర కు వెళ్లే భక్తులు ముందుగా కొండగట్టు అంజన్న స్వామి దర్శనం చేసుకొని వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో మొక్కులు చెల్లించుకోవడానికి బారులు తీరారు. సుమారు ఇరవై వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. 

బొజ్జ పోతన్న వైపు, ఘాట్ రోడ్డులో భక్తుల వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు వాపోతున్నారు. ఎండలోనే స్వామి వారి దర్శనానికి క్యూ లైన్ లలో నిలుచున్నారు. కొంతమేర ఐరన్ మెట్లు ఉండటంతో ఎండ వేడికి మహిళలు ఇబ్బంది పడ్డారు. క్యూ లైన్ లల్లో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.