సీఎం దృష్టికి తార్నాక సమస్యలు

సీఎం దృష్టికి తార్నాక సమస్యలు

తార్నాక, వెలుగు: తార్నాక డివిజన్​లోని పలు కీలక ప్రజా సమస్యలను సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మంగళవారం తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని తొమ్మిది బస్తీలకు సంబంధించిన డబుల్ బెడ్​రూమ్ ఇండ్ల సమస్య, పలు బస్తీల విలీన అంశాలపై చర్చించారు.

అలాగే విజయ డెయిరీ క్వార్టర్స్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని, తద్వారా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని, తార్నాక డివిజన్ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.