ఐపీఎల్ కొత్త యాడ్ వైరల్..అదరగొట్టిన ధోనీ 

ఐపీఎల్ కొత్త యాడ్ వైరల్..అదరగొట్టిన ధోనీ 

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత్ లో నిలిచిపోయిన IPL 14 సీజన్ త్వరలోనే పునఃప్రారంభం కాబోతోంది. సెప్టెంబరు 19 నుంచి UAE  వేదికగా ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో టోర్నీ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ చానల్ ఆసక్తికర ప్రచార వీడియోను రిలీజ్ చేసింది. 

ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ వెరైటీ గెటప్పుతో దర్శనమిచ్చాడు. జుట్టుకు రంగు, ఫ్యాషనబుల్ డ్రెస్సుతో హుషారుగా స్టెప్పులు వేశాడు. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ వస్తోందని, తుపానులా ఉంటుందని ధోనీ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే..ధోనీ వెరైటీగా చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.