బస్సులో లేడీస్  సీట్లోకూర్చుంటే 500 ఫైన్ 

బస్సులో లేడీస్  సీట్లోకూర్చుంటే 500 ఫైన్ 

ముంబయి: దేశ ఆర్ధిక రాజధానిలో రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో ప్రయాణించే మహిళలకు కేటాయించిన సీట్లలో మగవాళ్లు కూర్చుంటే రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించింది. బస్సులో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయని గబుక్కున కూర్చున్నా.. ఫైన్ తప్పదు. కండక్టర్ మిన్నకుండిపోయినా పోలీసులొచ్చి ఫైన్ వేసే అవకాశం ఉంది. రవాణా శాఖ అధికారులే కాదు పోలీసులు కూడా ఈ మేరకు జరిమానా విధించి వసూలు చేసేలా ఆదేశాలిచ్చింది సంస్థ. మహారాష్ట్ర మోటారు వెహికల్ నిబంధన ప్రకారం మహిళల సీట్లలో కూర్చునే పురుషులపై ఐపీసీ సెక్షన్ 102 కింద కేసు నమోదు చేస్తారు.