RCB vs MI: మరోసారి ముంబై ఫ్లాప్ షో.. బెంగళూర్ ముందు స్వల్ప టార్గెట్

RCB vs MI: మరోసారి ముంబై ఫ్లాప్ షో..  బెంగళూర్ ముందు స్వల్ప టార్గెట్

మ్యాచే కాదు.. టౌర్నమెంట్ నుంచే చేతులెత్తేసినట్లుంది ముంబై. బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి ఫ్లాప్ షోతో తేలిపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూర్ బౌలర్ల ధాటికి.. స్టార్స్ అంతా పెవిలియన్ దారి పట్టారు. తిలవ్ వర్మ (57), నమన్ ధీర్ (47) కాస్త నిలకడగా ఆడటంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. 

భువనేశ్వర్ కుమార్ విజృంభణ:

ముంబై బ్యాటర్లను ఆరంభంలోనే గట్టి దెబ్బ కొట్టాడు భువనేశ్వర్ కుమార్.  ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ.. రెండు ఫోర్లు, రెండు సిక్సులతో ఊపుమీదున్నట్లు కనిపించినా.. 22 రన్స్ చేసి భువనేశ్వర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అలాగే మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయకుండా భువనేశ్వర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అటు సూర్యకుమర్ యాదవ్ ను డకౌట్ చేశాడు భువి. ఆ తర్వాత ఊపు మీదున్న తిలక్ వర్మను కూడా ఔట్ చేసి భారీ దెబ్బకొట్టాడు.

ఆదుకున్న తిలక్ వర్మ, నమన్ ధీర్:

వెంటవెంటనే వికెట్లు పడిపోతున్న తరుణంలో నమన్ ధీర్, తిలక్ వర్మ ఆదుకున్నారు. తిలక్ 42 బంతులలో 2 సిక్సులు, 3 ఫోర్లతో అర్థ సెంచరీ చేశాడు. 57 రన్స్ చేసిన తర్వాత భువనేశ్వర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మరోవైపు నమన్ ధీర్ కుడా 2 సిక్సులు, 5 ఫోర్లతో 47 రన్స్ చేసి.. ముంబైకి గౌరవప్రదమైన స్కోర్ వచ్చేలా కఋషి చేశారు. ఆ తర్వాత అందరూ పెవిలియన్ కు క్యూ కట్టినవాళ్లే. దీంతో బెంగళూర్ ముందు కేవలం 167 రన్స్ టార్గెట్ మాత్రమే ఇవ్వగలిగింది. 

ఇక బెంగళూర్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు, హేజిల్ వుడ్ , సలామ్ దర్, షెఫార్డ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.