
ఇంటర్మీడియల్ ఫస్టియర్ విద్యార్థులందరిని పాస్ చేయాలనే డిమాండ్ తో విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య. కరోనాతో ఫిజికల్ క్లాసులు జరగలేదని.. ఆన్ లైన్ చదువులు విద్యార్థులకు అర్థం కాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు పెట్టడం వల్లే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు కృష్ణయ్య. ప్రతీ ఒక్కరికి గ్రేస్ మార్కులు వేసి పాస్ చేయాలని డిమాండ్ చేశారు.