
- నిర్మాణ రంగం కేటగిరీలో ఎంపిక
- అవార్డును ప్రదానం చేసిన కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా
హైదరాబాద్, వెలుగు: బెస్ట్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ ఇన్ కన్‌స్ట్రక్షన్ సెక్టార్ కేటగిరీలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) కు ప్లాటినం అవార్డు లభించింది. ఐఎస్ డీఏ ఇన్‌ఫ్రాకాన్ నేషనల్ అవార్డ్స్ నుంచి ‘ఎక్సలెన్స్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్’ విభాగంలో గోల్డ్ అవార్డు లభించింది. ఈ అవార్డును న్యాక్ డైరెక్టర్ జనరల్, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన తరపున కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా నుంచి న్యాక్ డైరెక్టర్ శాంతి ఇటీవల అందుకున్నారు.
కాగా.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ అకాడమీ (ఐఎస్ డీఏ) నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల్లో స్కిల్ డెవలప్ మెంట్, టెక్నాలజీ అమలులో న్యాక్ ముందుంది. రాష్ర్టంలో నిరుద్యోగ యువతకు నిర్మాణ రంగం, సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తోంది. 2024–-25లో న్యాక్ మొత్తం 24,346 మందికి శిక్షణ ఇచ్చి పలు కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా కృషి చేసింది.