శంషాబాద్, వెలుగు: తన కొడుకు నిశ్చితార్థానికి ఏకంగా ఐదు వందల మందికి విమానం టికెట్లు బుక్ చేసి గోవా తీసుకెళ్లాడో తండ్రి. నాగర్ కర్నూల్‌కు చెందిన మేకల అయ్యప్ప తన కొడుకు జగపతి నిశ్చితార్థాన్ని గోవాలో ఘనంగా ఏర్పాటు చేశారు.
ఈ వేడుకకు తన గ్రామానికి చెందిన 500 మంది రైతు కుటుంబాలను, బంధువులను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల ద్వారా గోవాకు తరలించారు. గ్రామస్తులందరికీ విమాన ప్రయాణ అవకాశం కల్పించాలనే తలంపుతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అయ్యప్ప, ఆయన కుమార్తె జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య పేర్కొన్నారు.
