హైదరాబాద్: చిన్న చిన్న కేసుల్లో నిందితులకు నాంపల్లి కోర్టు వినూత్నంగా శిక్షలు వేసింది. పెట్టీ కేసుల్లో నిందితులను సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. కోర్టు సూచనల మేరకు పోలీసులు నిందితులతో పార్కులను శుభ్రం చేయించారు..నాంపల్లి కోర్టు సూచనల మేరకు మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణకాంత్ పార్క్‌లో బుధవారం ( డిసెంబర్ 3) నిందితులతో పార్క్ ను క్లీన్ చేయించారు పోలీసులు. మొత్తం 42 మంది నిందితులు పార్కులో ఉన్న చెత్త, బీరు బాటిల్స్ వంటి గార్బేజ్ ని ఎత్తించారు.
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25మంది, బోర బండ పీఎస్ పరిధిలో 12 మంది, పంజాగుట్ట పీఎస్ పరిధిలో ఐదుగురు నిందితులు ట్రాఫిక్ర రూల్స్ ఉల్లంఘటన, దాడులు, దొంగతనాలు, ప్రజల పట్ల అసభ్య ప్రవర్తన, అల్లర్లు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారిపై కేసుల్లో నాంపల్లి కోర్టుముందు హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పోలీసులు వీరి చేత కృష్ణ కాంత్ పార్కును శుభ్రం చేయించారు.
