ఆయనది స్ట్రాంగ్ పర్సనాలిటి.. ఎవరూ ఏమీ చేయలేరు: నారా భువనేశ్వరి

ఆయనది స్ట్రాంగ్ పర్సనాలిటి.. ఎవరూ ఏమీ చేయలేరు: నారా భువనేశ్వరి

తిరుపతి జిల్లాలో  చంద్రగిరి నియోజకవర్గంలో అగరాలలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించారు.  నిజం గెలవాలి కార్యక్రమంలో ఆమె  తన భర్త చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఆయన్ను ఏమీ చేయలేరు. చంద్రబాబును అరెస్టు చేస్తే అన్ని వర్గాల ప్రజలూ రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారు. ఆయనపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని  భువనేశ్వరి అన్నారు.  చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే వారని తర్వాతే కుటుంబానికి ప్రాధన్యత ఇచ్చేవారన్నారు.  

చంద్రబాబును కాదు.. రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు భువనేశ్వరి.. నందమూరి కుటుంబంలో పుట్టడం నా అదృష్టం.. నాన్న ఎన్టీఆర్ మమల్ని క్రమశిక్షణతో పెంచారు.. ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు మూడు వేల మంది అనాథ పిల్లలకు చదువు చెప్పించాం.. అనేక అపద సమయాల్లో పేదలను ఆదుకున్నాం అని గుర్తుచేశారు. నా బాధను మహిళలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానంటూ.. తాను . రాజకీయాలు చేసేందుకు నేను ఇక్కడకు రాలేదు. నిజం గెలవాలి అని చెప్పేందుకే వచ్చానని నారా భువనేశ్వరి అన్నారు.  ప్రజల జీవితాల్లో వెలుగులు  చంద్రబాబు నింపుతారని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు . ఈ పోరాటం నాది మాత్రమే కాదు.. ప్రజలందరిదీ. యువతకు ఉద్యోగాలు కల్పించాలని చంద్రబాబు నిత్యం ఆలోచించేవారని అలాంటి వ్యక్తిని సెంట్రల్ జైల్లో పెట్టడం ఎంతవరకు కరక్ట్ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ప్రజల కోసమే ఆలోచించారు. హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఆయనను చూసి నవ్వారన్నారు. చంద్రబాబు తప్పులను మొదట నేనే ఎత్తి చూపే దాన్ని.. కానీ, ఆయన ఒక విజన్ తో ఆలోచించేవారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా జైలులో ఆయన్ను నిర్బంధించారంటూ భావోద్వేగానికి గురయ్యారు. స్కిల్ స్కాం లో ఎలాంటి ఆధారాలు లేవు.. అనేక కొత్త కేసులు పెడుతున్నారు. ఎందులోనూ ఆధారాలు లేవన్నారు.

ALSO READ :- తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే: మంత్రి హరీష్రావు