తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే: మంత్రి హరీష్రావు

తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే: మంత్రి హరీష్రావు

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో  జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి హరీష్రావు.. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కొంతమంది మంత్రి హరీష్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, TSHDC చైర్మన్ చింతా ప్రభాకర్, TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. 

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సంగారెడ్డిలో ఈసారీ గులాబీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు. తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు హరీష్ రావు.. పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే మరో 60 యేళ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని అన్నారు.  

రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరుతున్నారు.. ఆయన చేరికతోనే బీజేపీ, కాంగ్రెస్ స్నేహబంధం బట్టబయలైందన్నారు మంత్రి హరీష్ రావు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ పార్టీలో ఉన్నా ఒకరికి ఒకరు గెలుపుకోసం పని చేస్తారని విమర్శించారు మంత్రి హరీష్ రావు. 

తెలంగాణలో ఇటీవల జరిగిన మూడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేశారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ ను తట్టుకోలేకే బీజేపీ పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలిపిందని మంత్రి హరీష్ రావు అన్నారు. 

విజన్ ఉన్న నేత కేసీఆర్.. అన్నం పెట్టే నాయకుడు కేసీఆర్.. సున్నం పెట్టే పార్టీలు విపక్ష పార్టీలు.. రాబో యే ఎన్నికల్లో మరోసారి బీఆర్ ఎస్ ను గెలిపించుకోకుంటే.. రాష్ట్రం ఆగం అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని నిరుగార్చడానికి రెండు పార్టీలు ఎన్నో కుట్రలు చేశాయి.. ప్రతిపక్ష పార్టీలు కుట్రలు భగ్నం చేసి రాష్ట్రాన్ని సాధించారు.. కేసీఆర్ వ్యక్తి కాదు తెలంగాణ శక్తి.. విజన్ నాయకుడు.. మూడో సారి కేసీఆర్ గెలిపించుకోవాలని మంత్రి హరీష్ రావు ప్రజలను కోరారు. 

ALSO READ :- అమిత్ షాతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటి.. తెలంగాణలో పొత్తు,సీట్ల సర్దుబాటుపై చర్చ