సీమంతం, అన్నప్రాసన మంచి ఆలోచన : ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి విశ్వనాథన్

సీమంతం, అన్నప్రాసన మంచి ఆలోచన : ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి విశ్వనాథన్
  •     రికార్డు పత్రాలిచ్చిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవ యువ నిర్మాణ్ సంస్థ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేయడం మంచి ఆలోచన అని ఏఐసీసీ తెలంగాణ ఇన్​చార్జి  విశ్వనాథ్​పెరుమాళ్ల అన్నారు. శుక్రవారం యూసుఫ్ గూడలోని ఓ ఫంక్షన్ హాల్లో  నిర్వహించిన సామూహిక సీమంతం, అన్నప్రాసన కార్యక్రమాలకు గర్భిణులు, తల్లులు, పిల్లలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

విశ్వనాథ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతులమీదుగా అన్నప్రాసన, సీమంత జరిపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్​ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో 2 వేల మంది గర్భిణులకు సీమంతం, సుమారు 1,000 మంది చిన్నారులకు అన్నప్రాసన చేయించామన్నారు. అనంతరం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆయనకు రికార్డు పత్రాలు అందజేశారు. 

సాంస్కృతిక సారథి చైర్​పర్సన్ వెన్నెల, మైనారిటీస్​రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్​ఇన్​స్టిట్యూషన్​సొసైటీ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి, కాంగ్రెస్​పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్​చార్జి ఝాన్సీరెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ అభ్యర్థి అజారుద్దీన్, సీనియర్ నాయకుడు చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.