కలెక్టరేట్లో 'ఆటోమెటిక్ వెదర్ స్టేషన్'

 కలెక్టరేట్లో 'ఆటోమెటిక్ వెదర్ స్టేషన్'

యాదాద్రి, వెలుగు: వాతావరణంలోని మార్పులను రికార్డ్​చేయడానికి యాదాద్రి జిల్లాలో మరో ఆటోమెటిక్​ వెదర్​స్టేషన్​ (ఏడబ్ల్యూఎస్​) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అనుమతులు వచ్చాయి. ఏడబ్ల్యూఎస్​తో ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగంతో పాటు వర్షపాతం వివరాలు ఆటోమెటిక్​గా రికార్డు చేస్తాయి. ఈ రిపోర్ట్​ ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డెవలప్​మెంట్​ ప్లానింగ్​ సొసైటీకి అందుతాయి. ఇలాంటి ఏడబ్ల్యూఎస్​లు జిల్లాలో ఇప్పటివరకూ 28 ఉన్నాయి. 

తాజాగా యాదాద్రి కలెక్టరేట్​లో ఏర్పాటు చేయడానికి అనుమతులు వచ్చాయి. దీని ఏర్పాటు కోసం స్థలం గుర్తించినట్టు సీపీవో వెంకట రమణ తెలిపారు. ఈ ఆటోమెటిక్​ వెదర్​ స్టేషన్లు ఉన్నప్పటికీ.. ప్రతి మండలంలోనూ మాన్యువల్​గా వెదర్​ రిపోర్ట్​ కోసం ఏర్పాట్లు చేశారు.