బంపరాఫర్ : బాంబు పెట్టినోడిని పట్టిస్తే రూ.10 లక్షలు

బంపరాఫర్ : బాంబు పెట్టినోడిని పట్టిస్తే రూ.10 లక్షలు

 బెంగళూరులో కలకలం సృష్టించిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ రివార్డ్ ప్రకటించింది. బాంబ్ పెట్టిన నిందితుడి ఆచూకి తెలిపిన వారికి  రూ. 10 లక్షల రివార్డ్ ఇస్తామని వెల్లడించింది.  నిందితుడి ఆచూకి తెలిపిన వారి  వివరాలు  గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ  తెలిపింది.

మార్చి 1న  రామేశ్వరం ప్రాంతంలో ప్రముఖ రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు సంభవించించిన సంగతి తెలిసిందే.. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారిలో ముగ్గురు కేఫ్ సిబ్బంది కాగా, ఇద్దరు కస్టమర్లుగా గుర్తించారు. మధ్యాహ్నం ఒంటిగంట  ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.

రామేశ్వరం కేఫ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన బెంగళూరు పోలీసులు ఒక వ్యక్తి ముఖానికి బ్యాగ్ తో ముఖానికి మాస్క్, తలకి క్యాప్ పెట్టుకొని కేఫ్ ప్రవేశిస్తున్న విజువల్స్ ని పోలీసులు రిలీజ్ చేశారు. ఓ వ్యక్తి ఇడ్లి ప్లేట్ తో కేఫ్ లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు.

ALSO READ :- ఈ తేదీల్లోనే.. గ్రూప్ 1, 2, 3 పరీక్షలు

పేలుడు కారణమైన బ్యాగ్ ను వదిలేసి వెళ్ళింది ఈ వ్యక్తే అని పోలీసులు అనుమానిస్తున్నారు.  నిందితుడు మార్చి 1న  బస్సులో కేఫ్‌కు చేరుకున్నాడు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో రెస్టారెంట్‌లోకి  వెళ్లి  రవ్వా ఇడ్లీ ఆర్డర్ చేసి డైనింగ్ ఏరియాకు వెళ్లాడు. అయితే ఆర్డర్ చేసిన ఫుడ్ తినలేదు. అక్కడే ఓ బ్యాగ్ ను వదిలి వెళ్లిపోయాడు. తర్వాత టైమర్ సెట్ చేసి వెళ్లిపోయాడని చెప్పారు పోలీసులు.