ఈ తేదీల్లోనే.. గ్రూప్ 1, 2, 3 పరీక్షలు

ఈ తేదీల్లోనే.. గ్రూప్ 1, 2, 3 పరీక్షలు

 తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ తేదీలను  ప్రకటించింది టీఎస్పీఎస్సీ.   ఆగస్ట్ 7, 8 వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష ,  అక్టోబర్ 21 నుండి గ్రూప్ వన్  మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 17, 18 వ తేదీల్లో   గ్రూప్3 పరీక్షలు ఉంటాయని ప్రకటించింది టీఎస్పీఎస్సీ.

ఎగ్జామ్ తేదీలు

  • గ్రూప్ 1 మెయిన్స్ : అక్టోబర్ 21వ తేదీ నుంచి
  • గ్రూప్ 1 ప్రిలిమినరీ : జూన్ 9వ తేదీ
  • గ్రూప్ 2 పరీక్ష : ఆగస్ట్ 7, 8 తేదీల్లో
  • గ్రూప్ 3 పరీక్ష : నవంబర్ 17, 18 తేదీల్లో

ఎన్ని పోస్టులంటే?

  • 2024, ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది. 
  • 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో గ్రూప్ 2 నోటిఫికేషన్​రిలీజ్ చేసింది టీఎస్ పీఎస్సీ. 5,51,943 మంది అప్లై చేసుకున్నారు
  • రాష్ట్రంలో 1,363 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30న గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అదనంగా మరో 12 పోస్టులు చేర్చారు. మొత్తం 1,375 పోస్టుల కోసం 5.36 లక్షల మంది అప్లై చేసుకున్నారు.