NIA Riads: దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

NIA Riads: దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

దేశంలో ఉగ్రవాద-గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌లు లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు.  దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి అధికారులు దాడులు నిర్వస్తున్నారు. పంజాబ్, హర్యానా, చండీఘర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పోలీసులతో కలిసి ఎన్ఐఏ బృందాలు అనుమానిత ప్రాంతాల్లో ఏక కాలంలో విసృత సోదాలు నిర్వహిస్తున్నారు.

గత జనవరిలో, NIA నిషేధిత సంస్థలైన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్(BKI) , లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన మూడు కేసుల్లో ఎన్ఐఏ అధికారులు.. నార్త్ ఇండియాలోని 32 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.  సరిహద్దుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు(IED) అక్రమంగా రవాణా,  కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తుండడంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి అనుమానిత నివాసాల్లో నిర్వహించింది.