ఏపీలో నైట్ కర్ఫ్యూ నెలాఖరు వరకు పొడిగింపు

ఏపీలో నైట్ కర్ఫ్యూ నెలాఖరు వరకు పొడిగింపు
  • సభలు, సమావేశాలు.. పెళ్లిళ్లకు గరిష్టంగా 250మంది వరకూ అనుమతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు జిల్లాలో కర్ప్యూ అమలులో ఉంటుంది. అలాగే సభలు, సమావేశాలు, వివాహాల వంటి శుభకార్యాలకు గరిష్టంగా 250 మంది వరకూ అనుమతినిస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
వివాహాలు, ఇతర శుభ కార్యాలు, మతపరమైన సమావేశాలు ఏదైనా సరే గరిష్టంగా 250 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అందరూ కోవిడ్ నిబంధనలు విధిగా పాటించేలా చూడాలని, మాస్కులు ధరించడంతో పాటు  భౌతిక దూరం పాటించాలని, శానిటైజ్  చేసుకునేలా చూడాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో కానీ ఫంక్షన్ హాళ్ళలో గాని ఫిక్స్డ్ సీట్లు ఉంటే ఒక సీటు తర్వాత గ్యాప్ ఇచ్చి మరో సీట్ లో కూర్చునేలా చూడాలని స్పష్టం చేసింది.