ముక్కు మూసుకోవాల్సిందే.. గాంధీ ఆసుపత్రిలో కంపు కొడుతున్న టాయిలెట్లు

ముక్కు మూసుకోవాల్సిందే.. గాంధీ ఆసుపత్రిలో కంపు కొడుతున్న టాయిలెట్లు

గవర్నమెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంటేనే ఇప్పుడు జనాలు భయపడుతారు. అవసరమైతే రూపాయి అప్పు చేసి అయినా సరే..  ప్రైవేటు లోనే ట్రీట్మెంట్ తీసుకుంటునన్నారు తప్పా.. సర్కారు దవాఖానకు రానంటే  రానంటున్నారు. 

అక్కడ చికత్స  సంగతి కాసేపు  పక్కన పెడితే క్లీనింగ్ కూడా సరిగ్గా ఉండటం లేదు.  హైదరాబాద్  లోని  గాంధీ ఆసుపత్రిలో టాయిలెట్లు కంపు కొడుతున్నాయి.  వాటి నిర్వహణను సిబ్బంది ఏ  మాత్రం పట్టించుకోవడం లేదు. శానిటేషన్ చేయకపోవడంతో  అందులోకి వెళ్లాలంటే రోగులు అవస్థలు పడుతున్నారు. 

ALSO READ : ప్రభుత్వ హాస్పిటల్‌‌లో అన్ని వసతులు కల్పిస్తాం : గండ్ర వెంకటరమణారెడ్డి

మరో గత్యంతరం లేక  ముక్కు మూసుకోని పని కానిచేస్తున్నారు. రోగాల పరిన పడి చికత్స కోసం ఆసుపత్రికి వస్తే..  మరిన్ని  ఇన్ఫెక్షన్ లకు గురయ్యే ప్రమాదం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై సిబ్బందికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదంటున్నారు.