రాష్ట్రంలో స్టాండింగ్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి : డాక్టర్స్ అసోసియేషన్

రాష్ట్రంలో స్టాండింగ్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి : డాక్టర్స్ అసోసియేషన్
  • ప్రభుత్వ టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జిల్లాల్లో గల మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ కొరతను తీర్చేందుకు రాజ్యసభ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో పోలిస్తే టీచింగ్ వృత్తిలో సాలరీలు ఆకర్షణీయంగా లేకపోవడం, నాన్- అర్బన్ ప్రాంతాల్లో నివాస వసతులు, పిల్లల చదువులకు ఇబ్బందులు ఉండటమే డాక్టర్ల విముఖతకు కారణమని రాజ్యసభ కమిటీ తేల్చిచెప్పిందని వారు గుర్తుచేశారు. 

అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు  స్పెషల్ అలవెన్సులు, క్వార్టర్స్, పిల్లల విద్యకు భరోసా కల్పించే స్పెషల్ ఇన్సెంటివ్స్ ప్రకటిస్తేనే మెడికల్ ఎడ్యుకేషన్ ను బలోపేతం చేయగలమని సంఘం అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ బొల్లెపాక, సెక్రటరీ జనరల్ డాక్టర్ కిరణ్ మాదాల, ఉపాధ్యక్షుడు కిరణ్ ప్రకాశ్, కోశాధికారి రమేశ్ స్పష్టం చేశారు.