గణిత శాస్త్ర ల్యాబ్తో విద్యార్థులకు ఉపయోగకరం : డీఈవో అశోక్

గణిత శాస్త్ర ల్యాబ్తో విద్యార్థులకు ఉపయోగకరం : డీఈవో అశోక్
  • డీఈవో అశోక్

బోధన్, వెలుగు : గణిత శాస్త్ర ల్యాబ్​ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుందని డీఈవో అశోక్ తెలిపారు. శనివారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అజాంగంజ్​లో    గణిత శాస్త్ర ల్యాబ్​ను డీఈవో ప్రారంభించి మాట్లాడారు. ల్యాబ్​లో  విద్యార్థులు తయారు చేసిన వివిధ గణిత నమూనాలు, బోధన పద్ధతులను పరిశీలించి అభినందించారు. 

ఇలాంటి ల్యాబ్‌లతో  విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుందన్నారు. గణిత శాస్త్ర ప్రాముఖ్యతను వివరిస్తూ, విద్యార్థులు సులువుగా నేర్చుకునేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో బోధన్ ఎంఈవో నాగయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.